telugu navyamedia
సినిమా వార్తలు

“జెర్సీ”కి ప్రముఖుల ప్రశంసలు

Jersey

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి తెరకెక్కించిన చిత్రం “జెర్సీ” క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన‌ ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది. తొలి షో నుంచే జెర్సీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ట్విటర్‌ వేదికగా నానితో పాటు “జెర్సీ” టీంపై ప్రశంసలు కురిపించాడు.

“బ్రో నాని.. నీ అద్భుతమైన నటనతో బంతి బౌండరీలు దాటింది. అద్భుతం… అద్భుతం… అద్భుతం ! ఇదో అద్భుతమైన సినిమా. ఈ సినిమాలో నీ నటనను నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రోలర్‌ కోస్టర్‌లో రైడ్‌ చేసిన అనుభూతిని కలిగించింది. ఇలాంటి సబ్జెక్ట్‌ ఎంచుకుని దానిని పక్కాగా తెరకెక్కించిన గౌతం తిన్ననూరి ప్రతిభకు హాట్సాఫ్‌. అదే విధంగా గౌతం విజన్‌కు తగ్గట్లుగా నటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గౌతమ్‌ విజన్‌ను అర్థంచేసుకుని, ఆయనకు మద్దతిచ్చినందుకు చిత్రబృందానికి అభినందనలు” అని తార‌క్ పేర్కొన్నారు.

మంచు మ‌నోజ్‌, అల్లు అర్జున్‌, అల్ల‌రి న‌రేష్ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. జెర్సీ చిత్రం హృద‌యానికి హ‌త్తుకునే మూవీ అని చెబుతూ చిత్ర బృందానికి శుభాకాంక్ష‌లు తెలిపాడు బ‌న్నీ. నాని త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టాడ‌ని అన్నారు. నాని కెరీర్‌లో ఇదో బెస్ట్ చిత్రం.గౌత‌మ్ తిన్న‌నూరి చిత్రాన్ని అద్భుతంగా రూపొందించాడు అని ప్రశంసించాడు బ‌న్నీ.

Related posts