telugu navyamedia
సినిమా వార్తలు

55 సంవత్సరాల “వరకట్నం”.

నటరత్న పద్మశ్రీ ఎన్.టి. రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం రామకృష్ణ, ఎన్.ఏ.టి. వారి “వరకట్నం” 10-01-1969 విడుదలయ్యింది. సమాజంలో ఒక సామాజిక రుగ్మతగా వేళ్ళూరుకుపోయిన వరకట్న దురాచారన్నీ ఇతివృత్తం గా తీసుకుని రామకృష్ణ ఎన్.ఏ.టి. కంబైన్స్ బ్యానర్ పై నందమూరి తివిక్రమరావు గారు నిర్మాతగా స్వీయ దర్శకత్వంలో ఎన్.టి.రామారావు గారు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, : ఎన్ టి రామారావు, మాటలు: మద్దిపట్ల సూరి, సముద్రాల జూనియర్, పాటలు: కొసరాజు సి.నారాయణరెడ్డి, సంగీతం: టి.వి రాజు, ఫోటోగ్రఫీ: రవికాంత్ నగాయిచ్, నృత్యం: వెంపటి సత్యం, కళ: ఎస్ కృష్ణారావు, కూర్పు: జి.డి. జోషి అందించారు. ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, సావిత్రి, సత్యనారాయణ, నాగభూషణం, రాజనాల, మిక్కిలినేని, పద్మనాభం, అల్లూరి రామలింగయ్య, సూర్యా కాంతం, చంద్రకళ, రావికొండలరావు, తదితరులు నటించారు.

ప్రముఖ సంగీత దర్శకుడు టి.వి.రాజు సంగీత సారధ్యంలో పాటలన్నీ హిట్ అయ్యాయి.
“అడుగు అడుగులో మదమరాళములతో”
“ఎన్నాళ్ళకు నా నోము పండింది”
“ఇదేనా మన సంప్రదాయమిదేనా”
“సైసై జోడెడ్ల బండి షోకైన దొరలబండి”
“మరదల మరదల తమ్ముని పెండ్లమా”
“పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా ”
“గిలకల మంచం ఉంది, చిలకల పందిరి”
వంటి పాటలుప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఎన్. టి.రామారావు గారు తొలిసారిగా ఒక సాంఘిక చిత్రానికి దర్శకత్వం వహిస్తూ నిర్మించిన ఈ సినిమా కు ఆ ఏడాది ఉత్తమ తెలుగుచిత్రంగా జాతీయ అవార్డును లభించింది. ఈ చిత్రం విజయవంతంగా నడిచి విడుదలైన పలు కేంద్రాలలో 50 రోజులు, డైరెక్ట్ గా 2 కేంద్రాలలో 100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది.
100 రోజులు ఆడిన కేంద్రాలు:–
1. విజయవాడ – దుర్గా కళామందిరం
2. రాజమండ్రి — అశోక
తిరిగి 1982 లో మళ్ళీ విడుదలైనప్పుడు హైదరాబాద్ లో శతదినోత్సవం జరుపుకుని రికార్డ్ సృష్టించింది…..

Related posts