ఏపీలో బహుజన సమాజ్ పార్టీతో జనసేన ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బిఎస్పీకి జనసేన 21 సీట్లు కేటాయించింది. అయితే తాము అడిగిన సీట్లు కాకుండా వేరే సీట్లు కేటాయించారని బిఎస్పీ స్థానిక నాయకులు మండిపడుతున్నారు. బిఎస్పీ రాష్ట్ర సమన్వయకర్త భీర్ సింగ్ గురువారం అమరావతిలో కొంత మంది నాయకులతో సమావేశమయ్యారు.
జనసేన తమకు బలం ఉన్న సీట్లను కేటాయించే విధంగా చర్యలు తీసుకుని నేతలు భీర్ సింగ్ పై ఒత్తిడి తెచ్చారు. లేదంటే తాము తిరుగుబాటు అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తామని కూడా హెచ్చరించారు. జనసేన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడానికి వారు ముందుకు రావడం లేదు. మరో వైపు జనసేన పై విమర్శలు గుప్పిస్తున్నారు. లోకసభ, శాసనసభ నియోజకవర్గాల్లో జనసేనకు డిపాజిట్లు రావని దుయ్యబడుతున్నారు.
సమస్యలపై రాసిన లేఖలకు జగన్ నుంచి స్పందన లేదు : కన్నా