ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం జరిగింది. రాజధాని, ఇన్సైడర్ ట్రేడింగ్ పై సభ అట్టుడుకింది. విశాఖ రాజధానిగా కావాలని ఎవరడిగారిని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవాడు అయి ఉండి కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనిషి పెరిగాడు కానీ బుర్ర పెరగలేదని విమర్శించారు.
అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ కోరుకుంటున్నారని చెప్పారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతించాలని అన్నారు. స్పీకర్ గురించి కూడా విపక్ష సభ్యులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారనిమండిపడ్డారు. టీడీపీ వాళ్లలా హత్యలు చేసి తాము అసెంబ్లీకి రాలేదని బొత్స పేర్కొన్నారు.


చంద్రబాబు ప్రచారం వల్ల బీజేపీకి లాభమే: దత్తాత్రేయ