telugu navyamedia
ఆరోగ్యం

తుల‌సితో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది..!

తులసికి భారతీయ సంస్కృతి లో ప్రత్యేక స్థానం ఉంది. తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతారు. రోజుకు కనీసం ఒక మూడు ఆకులు తింటే కొన్ని సమస్యలకు తక్షణమే పరిష్కారం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తుల‌సితో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఔషధాల తులసిని ఆయుర్వేదంలో కూడా ఉపయోగిస్తుంటారు. 

Vastu tips for placing tulsi plant at home | Housing News

తులసి గింజలను పొడిచేసి గోరువెచ్చని నీళ్లతో కలిపి ముఖంమీద లేపనం చేసుకుంటే సైనస్‌లోని ఒత్తిడి తగ్గి నొప్పినుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి వ‌ల‌న షూగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్లో ఉంటాయి.  అలాగే ర‌క్తం సుద్ది అవుతుంది. తులసి ఆకుల రసం, చిన్న ఏలక్కాయ గింజల పొడి, అల్లం రసాలను కలిపి తీసుకుంటే వాంతులు, వికారం వంటివి తగ్గుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లోని పెరట్లో తులసి మొక్కను కచ్చితంగా ఉంటుంది.

అంతే కాదు తులసిని ప్రత్యక్ష దైవంగా హిందువులు పూజిస్తారు . తులసి మొక్క ఇంట్లో ఉంటే దాని వ‌ల్ల ఇంట్లోకి నెగిటివ్ ఎన‌ర్జీ ప్ర‌వేశించ‌ద‌ని భావిస్తారు.

Tulsi Pujan Day: All you need to know | India News | Zee News

తుల‌సిలో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు:-
*  చర్మరోగాలు నివారిస్తుంది.
* ఆస్మా ఆస్మా, ఆయాసం, కోరింత దగ్గులను అరికడుతుంది. కఫాన్ని విరుస్తుంది.
* సాంక్రమిక వ్యాధులైన కలరా, ప్లేగు వంటివి అదుపులో ఉంచుతుంది.
* కడుపులో నులి పురుగుల్ని నిర్మూలిస్తుంది.
* తులసి రసం మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు, శిరో భారం తగ్గుతాయి.
* తులసి రసాన్ని పై పూత గా పూస్తే, ఆర్నెల్లకు బొల్లి వ్యాధి మాయమవుతుంది.
* తులసి విషహారిణిగా పనిచేస్తుంది.
* ఇస్నోఫీలియా ను నయం చేస్తుంది.
* మెదడు వాపు వ్యాధి ని నివారిస్తుంది.
* ఆకలిని వృద్ధి చేస్తుంది.
* నోటి అరుచి పోగొడుతుంది.
* శ్వాసకోశనాళ శుభ్రతకు దోహదపడుతుంది.
* పులిపిర్లను నిరోధిస్తుంది.
*తులసి ఆకు రసం లో కొబ్బరి నూనె కలిపి కాళ్ల పగుల్లకు పూస్తే త్వరగా త‌గ్గే అవకాశం   ఉంది.
* రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది.
* ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 – 15 తులసి ఆకుల్ని నమిలి తింటూవుంటే,   శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
* మలబద్దకాన్ని నివారిస్తుంది.
* నోటి దుర్వాసన ను అరికడుతుంది.
* కిడ్నీలో రాళ్లు కరిగిస్తుంది.

Related posts