శ్రీను వైట్ల దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందిన చిత్రం “దూకుడు”. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మించగా… సెప్టెంబర్ 23, 2011లో విడుదలైన ఈ చిత్రం నేటితో ఈ చిత్రం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 2011లో “దూకుడు” బిగ్గెస్ట్ హిట్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంలో మహేష్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించగా, ఆయన కెరియర్లో “పోకిరి” తర్వాత బాక్సాఫీస్ వద్ద అంతటి “దూకుడు”ను చూపించింది. ప్రకాశ్ రాజ్, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మీ, కోట శ్రీనివాసరావు కీలకపాత్రల్లో నటించగా… సమంత హీరోయిన్ గా నటించింది. ఆగస్ట్ 9న సూపర్ స్టార్ మహేష్ పుటిట్నరోజు సందర్భంగా అభిమానులు కొద్ది రోజుల నుండే సోషల్ మీడియాలో బర్త్డే హంగామా మొదలు పెట్టేశారు. నిర్మాత అనిల్ సుంకర చేతుల మీదుగా విడుదల చేసిన కామన్ డీపీతో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు. #SuperstarMAHESHBdayCDP హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. మహేష్ బర్త్డే పురస్కరించుకొని ఏఎంబీ సినిమాస్ “దూకుడు” చిత్రం ప్రత్యేక షో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే “దూకుడు” టికెట్స్ బుకింగ్స్ మొదలు కాగా, వాటి కోసం జనాలు థియేటర్ దగ్గర బారులు తీరారు. మహేష్ బర్త్ డే రోజు రెండు తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లోని సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున పలు సామాజిక కార్యక్రమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.