telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయి: బీజేపీ నేత రఘునందన్

Raghunandan

టీఆర్ఎస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. హైదరాబాదులోని బీహెఈఎల్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులతో కలసి రఘునందన్ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు ముగింపు పలికేందుకు అన్ని కార్మిక, ప్రజా సంఘాలు రంగంలోకి దిగాయని అన్నారు. ఆర్టీసీని నిర్వీర్యం చేసేందుకు సీఎం యత్నిస్తున్నారని ఆరోపించారు.

ఆర్టీసీ ఆస్తులను అమ్ముకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తన బంధువులకు ఆర్టీసీ భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులపై కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts