తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే ఆదాయం పై బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం రాయలసీమలో ఉందని, టీటీడీకొచ్చే డబ్బులన్నీ రాయలసీమ అభివృద్ధికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి, సింహాచలం ఆలయాల డబ్బులు ఆ ప్రాంతానికే ఖర్చు పెడుతున్నారని చెప్పారు.
దేశంలోని అన్ని ప్రాంతాల వారిని టీటీడీ మెంబర్స్‌గా నియమిస్తున్నారని అన్నారు. కానీ వారు మాత్రం రాయలసీమ అభివృద్ధిపై శ్రద్ద పెట్టడం లేదన్నారు. ఇక రాయలసీమ నీళ్లు ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమన్నారు. గోదావరి నీళ్లు కృష్ణా ప్రాంతానికే ఇచ్చి.. రాయలసీమ నీళ్లు సీమకే వాడుకునేలా చేస్తామని గతంలో వైఎస్ చెప్పారని గుర్తుచేశారు. కానీ ఇంత వరకూ ఆ జీవో అమలు కాలేదని ఆరోపించారు. దీని వల్ల భవిష్యత్‌లో అలజడులు చెలరేగే అవకాశం ఉందని సూచించారు.

