గత జగన్ ప్రభుత్వ హయాంలో తిరుమలలో చాలా అక్రమాలు జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు.
గతంలో ఉన్న టీటీడీ పాలకమండళ్లు భారీగా అవినీతి, అక్రమాలకు పాల్పడాయని విమర్శించారు.
ఇవాళ(గురువారం) ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వెంకటేశ్వర స్వామివారిని లక్ష్మణ్ దర్శించుకున్నారు.
అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వామి వారి లడ్డూలో జరిగిన కల్తీ భక్తులను ఆందోళనకు గురి చేసిందని అన్నారు.
గత ప్రభుత్వం హయాంలో తిరుమలలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు.

