telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

3న విజయన్‌.. యమదొంగ రీమేక్..

jr.ntr yamadonga now in tamil version

రాజమౌళి, ఎన్టీఆర్‌ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం ‘యమదొంగ’. 2007లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా చాలా కాలం తర్వాత తమిళంలో ‘విజయన్‌’గా అనువాదమైంది. ఇందులో మోహన్‌బాబు, ప్రియమణి, మమతా మోహన్‌దాస్‌, ఖుష్బూ తదితరులు నటించారు. మరగదమణి (కీరవాణి) సంగీతం సమకూర్చారు. కేకే సెంథిల్‌కుమార్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఏఆర్‌కే రాజరాజా తమిళంలో మాటలు రాశారు. రాజమౌళి దర్శకత్వంలో 11 చిత్రాలు విడుదలవగా.. అందులో ఐదు సినిమాలు తమిళంలో రీమేక్‌ అయ్యాయి. రెండు చిత్రాలు అనువాదమయ్యాయి. మూడు సినిమాలు నేరుగా తమిళంలో విడుదలయ్యాయి.

ఆయన సినిమాల్లో తమిళంలో విడుదల కాని ఏకైక చిత్రం ‘యమదొంగ’. ఇప్పుడు అది కూడా ‘విజయన్‌’గా తెరపైకి వస్తోంది. ఓం శ్రీసంపత్‌ కన్నియమ్మన్‌ క్రియేషన్స్‌, మునీశ్వరర్‌ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. జనవరి మూడో తేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.

Related posts