telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అంబేద్క‌ర్ పేరుపై ప్ర‌భుత్వం వివాదం సృష్టింస్తుంది.

*వైసీపీకి అంబేద్కర్‌ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్‌ పేరు పెట్టొచ్చుక‌దా..

*అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదు

*అంబేద్క‌ర్ పేరుపై ప్ర‌భుత్వం వివాదం సృష్టింస్తుంది..

*ఏపీలో ఉన్నామా?.. పాకిస్తాన్‌లో ఉన్నామా?..

* దేశ ప్ర‌జ‌ల‌కు సీఎం జ‌గ‌న్ క్ష‌మాప‌ణ చెప్పాలి..

అంబేద్కర్‌ పేరుపై వైసీపీ ప్రభుత్వం వివాదం సృష్టించిందని.. దేశప్రజలకు , అంబేద్కర్ కు సీఎం జగన్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఎంపీ జీవీఎల్ డిమాండ్ చేశారు.

కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన విధ్వంస కాండపై జీవీఎల్ నరసింహారావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ… మనం ఏపీలో ఉన్నామా?… పాకిస్తాన్‌లో ఉన్నామా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అంబేద్కర్‌ మీద చిత్తశుద్ధి ఉంటే నవరత్నాలకు అంబేద్కర్‌ పేరు పెట్టొచ్చుగా అని నిలదీశారు.

నిన్నటి అల్లర్లకు బాధ్యులెవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధ్వంసకర చర్యలు సమర్థనీయం కాదన్నారు. అల్లర్లలో బీజేపీ కార్యకర్తలెవరూ పాల్గొనలేదని స్పష్టం చేశారు.

 కొత్త జిల్లాల‌పై సంప్ర‌దింపులు జ‌ర‌గ‌డ‌కుండా ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం వ‌ల‌నే  ఈ సంఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని అన్నారు.

గుంటూరులో జిన్నా టవర్స్ పేరు మార్చాలని కోరితే తమ నేతలను అరెస్టు చేశారని గుర్తు చేశారు. హిందూ వ్యతిరేక విధానాలు వీడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు హెచ్చరించారు

Related posts