ఆంధ్రప్రదేశ్ లో శాసనమండలి రద్దు తీర్మానం ప్రవేశపెట్టడంపై బీజేపీ పార్టీల నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శాసన మండలి రద్దు విషయంలో.. వైసీపీ, టీడీపీ పార్టీలు దోషులేనని వ్యాఖ్యానించారు.
తండ్రి శాసనమండలిని ఏర్పాటుచేస్తే.. కుమారుడు జగన్ దాన్ని రద్దు చేస్తున్నారని అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెచ్చిన మండలిని తనయుడు జగన్ రద్దు చేయడం దురదృష్టకరమన్నారు. రద్దు విషయంలో కేంద్రం జోక్యం చేసుకునే అవకాశం లేదన్నారు. మండలి రద్దుకు కొంచెం సమయం పట్టచ్చన్నారు. దీనిపై న్యాయపోరాటం చేసే అవకాశముందని తెలిపారు.

