telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈరోజు రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి మాట్లాడనున్నారు

సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌ నుంచి రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు.

16న మధ్యాహ్నం క్యాబినెట్‌ సమావేశం అనంతరం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడనున్నారు. అందుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు.

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 72 రైతు వేదికల్లో వీడియోకాన్ఫరెన్స్‌ సామగ్రి అమర్చగా, తాజా మరో 142 రైతు వేదికల్లో వీడియోకాన్ఫరెన్స్‌ అందుబాటులోకి వచ్చింది.

ఈ వీడియోకాన్ఫరెన్స్‌ వ్యవస్థ ద్వారా రైతులకు ‘రైతు నేస్తం’ కార్యక్రమాలు ప్రసారం కానున్నాయి. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు సాగులో నూతన యాజమాన్య విధానాలు, ఆధునిక సాంకేతికత, యాంత్రీకరణపై రైతులకు అవగాహన కల్పించనున్నారు.

సీఎం ముఖాముఖికి ఒక్కో రైతు వేదికలో 250 మం ది రైతులకు తగ్గకుండా పాల్గొనేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఒక్కో రైతు వేదికలో జరిగే ఈ కార్యక్రమానికి జిల్లాస్థాయి, డివిజన్‌స్థాయి, మండలస్థాయి అధికారులు సైతం హాజరుకానున్నారు.

చౌటుప్పల్‌ పట్టణంలోని రైతు వేదికతో పాటు మండలంలోని పంతంగి, కుంట్లగూడెం గ్రామాల్లోని రైతు వేదికల్లో వీడియోకాన్ఫరెన్స్‌కు అధికారులు ఏర్పాట్లు చేశా రు.

పంతంగి, చౌటుప్పల్‌ రైతు వేదికల్లో కొత్తగా వీసీ సామగ్రిని ఏర్పాటుచేశారు. వీటి పనివిధానాన్ని ఏవో ముత్యాల నాగరాజు ఆదివారం పరిశీలించా రు. వీసీలు ఉన్న మూడు రైతు వేదికల వద్దకు రైతులు సకాలంలో చేరుకొని ముఖ్యమంత్రి సందేశాన్ని వీక్షించాలని ఆయన కోరారు.

Related posts