జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి జియాగూడలో బీజేపీ అభ్యర్థి దర్శన్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్.. టీఆర్ఎస్ మీద విరుచుకుపడ్డారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్కు 20 సీట్లు కూడా రావని తేలిపోయిందన్నారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఫెయిల్ అయిందని, పాత మ్యానిఫెస్టోనే కొత్తగా రూపొందించారని మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి విమర్శించారు. టీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై ప్రజల నుంచి రెస్పాన్స్ రావడం లేదన్నారు. బీజేపీ కార్యకర్తలను పోలీసులతో వేధిస్తున్నారు. మతాల మధ్య విభేదాలను బీజేపీ సృష్టించడం లేదు. కేటీఆరే విద్వేషాలను సృష్టిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మంచి పరిపాలన జరుగుతోంది. అది మీకు కనిపించడం లేదా కేటీఆర్ ? అంటూ వివేక్ విమర్శించారు. కేటీఆర్.. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరించు.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి పార్లమెంట్ స్థానాల్లోనూ, దుబ్బాక ఉప ఎన్నికలోను ఓడిపోయారు. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఓడిపోబోతున్నారంటూ వివేక్ ధీమా వ్యక్తం చేశారు. చూడాలి మరి ప్రజలు ఏ విధమైన తీర్పు ఇస్తారు అనేది.
							previous post
						
						
					
							next post
						
						
					


అమిత్ షా సంచలన ప్రకటన ..