telugu navyamedia
Uncategorized

హిందూ దేవాలయాల పట్ల చులకన భావం: కన్నా ఫైర్

Kanna laxminarayana

హిందూ దేవాలయాల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారని జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ధనంతో కేవలం ఒక మతాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. నూతన ఇసుక పాలసీ అమల్లోకి వచ్చి నెల రోజులైనప్పటికీ సామాన్యుడికి ఇసుక దొరకడం లేదని విమర్శించారు. కేంద్రం తీసుకువచ్చిన 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లు ఏపీలో అమలు కావడం లేదన్నారు.

ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెల 4న రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఇసుక కొరతపై 7న భిక్షాటన చేపడతామని… 11న పోలవరంలో పర్యటిస్తామని తెలిపారు. పారిపాలనలో టీడీపీ, వైసీపీ మధ్య ఎలాంటి తేడా లేదని కన్నా పేర్కొన్నారు.

Related posts