బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. జార్ఖండ్ లో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వస్తే జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని అమిత్ షా ప్రకటించారు..
జాతీయ భద్రత విషయంలో తాము రాజీ పడబోమని అన్నారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉన్న సమయంలో పాక్ ఉగ్రసంస్థలు భారత్ ను లక్ష్యంగా చేసుకునేవని తెలిపారు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేయాలన్న పాక్ కల ఎన్నటికీ నెరవేరదన్నారు. పాకిస్థాన్ నుంచి ఓ తూటా భారత్ వైపు వస్తే.. భారత్ నుంచి ఓ ఫిరంగి గుండు పాక్ కు దూసుకుపోతుందని షా హెచ్చరించారు.
రైతుల నిరసన పై సంచలన వ్యాఖ్యలు చేసిన రఘునందన్…