telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత..

*ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత..
*ఆస్ప‌త్రి ఫ‌ర్నిచ‌ర్‌, అద్దాలు ధ్వంసం..
*ఆందోళ‌న కారుల‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు..

 ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల వేధిస్తున్నారని పురుగుల మందు తాగి అత్మాహత్యాయత్నకు పాల్ప‌డిన బీజేపీ కార్య‌క‌ర్త సాయి గ‌ణేష్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

సాయిగణేష్‌ మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకుని ఆందోళన నిర్వహించారు.

ఆస్పత్రిలో సాయి గణేష్‌ మృతదేహానికి పోస్టుమార్టమ్ ఆలస్యం చేస్తున్నారని బీజేపీ నేతలు, కార్యకర్తలు ప్రభుత్వ ఆస్పత్రిపై దాడి చేశారు.

ప్రభుత్వాస్పత్రి ప్రధాన ద్వారాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశారు. నగరంలో టీఆర్‌ఎస్ నాయకుల ఫ్లెక్సీలకు బీజేపీ కార్యకర్తలు నిప్పు పెట్టారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు .

మంత్రి పువ్వాడ అజయ్, పోలీసుల ఒత్తిడి వల్లే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడ్డాడడని ఆరోపించారు. సాయి మరణానికి ప్రభుత్వం బాధ్యత వహించాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు . దీంతో ఖమ్మం నగరంలో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది.

Related posts