ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కమెడియన్ బిత్తిరి సత్తికి కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. అయితే కరోనా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ ఆదివారం ఆయన ఫేస్‌బుక్ లైవ్ నిర్వహించారు. తాను ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నట్టు చెప్పారు. “ఎట్లొచ్చిందో.. ఏడొచ్చిందో నాకైతే తెల్వదు కానీ.. మొత్తానికి వచ్చింది. పాజిటివ్ వచ్చినప్పుడు మనకు ఎవరైనా సాయం చేయడం కష్టం. ఎదుటి వాళ్లను ఇబ్బంది ఎందుకు పెట్టాలి. మనకు లేదని అబద్దం చెప్పి ఎదుటివాడికి వచ్చాక మనం సంబరపడకూడదు. మనకు వచ్చిందని నిజంగా చెప్పుకోవాలి. ఎదుటివాడికి వచ్చే వరకు మనం చెప్పకపోతే మనంత ద్రోహి ఇంకొకడు ఉండడు. అని సత్తి వెల్లడించారు. అయితే ఎరికైనా కరోనా సోకితే కొంత మంది వారిని పురుగుని చూసినట్టు చూస్తున్నారు” అంటూ చెప్పుకొచ్చారు బిత్తిరి సత్తి. వీటితో పాటు తనకు కనిపించిన లక్షణాలు, ప్రస్తుతం ఆయన తీసుకుంటోన్న జాగ్రత్తల గురించి ఫేస్‌బుక్ లైవ్‌లో బిత్తిరి సత్తి వెల్లడించారు.

