telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్ అగర్వాల్ ఎంగేజ్మెంట్… సీక్రెట్ గా…!?

Kajal

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య, కమల్ హాసన్ సరసన భారతీయుడు 2, అలాగే మంచు విష్ణుతో మోసగాళ్లు చేస్తున్న కాజల్ అగర్వాల్… మరో మూడు సినిమాలను లైన్‌లో పెట్టేసిందని టాక్. అయితే ఈ 35 ఏళ్ళ బ్యూటీ ఎట్టకేలకు పెళ్లికి రెడీ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు సీక్రెట్‌గా ఆమె ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందని తెలుస్తుండటం మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈ నిశ్చితార్థానికి సినీ ఇండస్ట్రీ నుంచి కాజల్ బెస్ట్ ఫ్రెండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఒక్కడు తప్పితే ఇంకెవ్వరూ ఈ ఎంగేజ్‌మెంట్‌కి హాజరు కాలేదట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు పెద్దలు కుదిర్చిన సంబంధానికే కాజల్ ఓకే చెప్పిందట. ఆమెకు కాబోయే వరుడి పేరు గౌతమ్ అని, ఆయనో బడా బిజినెస్‌మేన్‌ అని అంటున్నాయి సినీ వర్గాలు. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ప్రకటించక పోవడంతో ఇంతకీ ఇది నిజమేనా? లేక రూమరా? అనేది అర్ధంకాక తికమకపడుతున్నారు కాజల్ అభిమానులు.

Related posts