సినిమా ఇండస్ట్రీలో బయోపిక్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడాకారులపై తెరకెక్కుతున్న బయోపిక్ లు సెట్స్ పై ఉన్నాయి. ఇక ఇంతకుముందే ఎన్టీఆర్, వై.ఎస్.ఆర్ బయోపిక్స్ తో పాటు సావిత్రి బయోపిక్ కూడా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు దివంగత హీరోయిన్ ఆర్తీ అగర్వాల్ బయోపిక్ రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. కెరీర్ ప్రారంభంలో మంచి హిట్స్ సాధించి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్స్‌తో నటించారు. అయితే ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమ, లవ్ బ్రేకప్, తర్వాత అమెరికా వెళ్లి సెటిలవడం జరిగాయి. తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నాలు చేశారు అర్తీ అగర్వాల్. బరువు తగ్గడానికి జరిగిన లైపో ఆపరేషన్ వికటించడంతో ఆమె కన్నుమూశారు.
previous post
ట్రంప్ పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు…