బీజేపీ ప్లాన్ బీహార్ లో పనిచేసిందా… అంటే అవును అనే సమాధానం వస్తుంది. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో పొత్తుఉన్నా తన వ్యూహాలతో అతిపెద్ద పార్టీగా అవతరించే దిశగా అడుగులు వేస్తోంది భారతీయ జనతా పార్టీ… తొలి రౌండ్లలో ఆర్జేడీ పలుచోట్ల ఆధిక్యం కనబరిచినప్పటికీ క్రమంగా బీజేపీ ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం తర్వాత వెలువడిన ట్రెండ్స్ ప్రకారం.. ఏకైక పెద్ద పార్టీగా బీజేపీ నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మొత్తంగా ఎన్డీయే మెజారిటీ మార్క్‌ను కూడా దాటే అవకాశాలు బలంగా కనిపిస్తు్నాయి.. బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమి 127 స్థానాల్లో, ఆర్జేడీ కూటమి 106 స్థానాల్లో ముందజలో ఉన్నాయి… ఇక, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్‌జీపీ ఒక స్థానానికి పరిమితం కాగా.. 9 స్థానాల్లో స్వతంత్రులు లీడ్‌లో ఉన్నారు. ఇక, ఎల్‌జీపీని ఒంటరిగా పోటీ చేయించి.. ఓట్లు రాబట్టుకోవడంలో బీజేపీ సఫలంఅయినట్టు విశ్లేషకులు చెబుతున్నారు.. ఇప్పటి వరకు బీజేపీ 74 స్థానాల్లో, ఎన్డీయే భాగస్వామ్య పార్టీ అయిన జేడీయూ 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఆర్జేడీ 59 స్థానాల్లో, కాంగ్రెస్ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.. 29 చోట్ల ఇతరులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. మొత్తం 243 స్థానాల్లో మెజారిటీ మార్క్‌ను దాటాలంటే ఎన్డీఏ కూటమి కానీ, మహాఘట్ బంధన్ కానీ 122 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
previous post

