telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మళ్ళీ పాక్ కు సిద్దు.. మరో వివాదానికి తెరలేచింది..

EC Issues notices to Minister siddu

క్రికెటర్ సిద్దూ కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి పాకిస్తాన్ ఆహ్వానించిన నేపథ్యంలో ఆ దేశం వెల్లేందుకు సిద్దమయ్యారు. దీనితో మరో వివాదానికి తెరలేచినట్టయ్యింది. ఇప్పటికే ఓ సారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లి వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. నవంబర్ 9న పాకిస్తాన్ భూభాగంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. నవంబర్ 8న భారత భూబాగంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఆయనతో పాటు పంజాబ్ సీఎం అమరిందర్‌సింగ్, ఇతర ప్రజాప్రతినిధులు హజరుకానున్నట్టు ప్రకటించారు. తాజా భారత-పాకిస్థాన్‌ ఉద్రిక్త వాతవరణం నేపథ్యంలో ఈ కారిడార్ గుండా భారత్‌కు చెందిన సిక్కు యాత్రికులు పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌కు వెళ్లి పవిత్ర సిక్కు పుణ్యక్షేత్రమైన గురుద్వార సాహిబ్‌ను దర్శించుకోనున్నారు. ఇందుకోసం ఎలాంటీ వీసా అవసరం లేదని ఇప్పటికే పాకిస్తాన్ ప్రకటించింది. ఈ కారిడార్‌ పనులను పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు సంయుక్తంగా గత సంవత్సరం ప్రారంభించాయి. కారిడార్ సిక్కు గురువైన గురునానక్ జయంతి సంధర్భంగా ప్రారంభించనున్నారు.

దీనితో భారతప్రభుత్వం కార్తర్‌పూర్ వెళ్లేందుకు మొదటి సారిగా 575 మందికి అవకాశం కల్పించింది. అందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు ఇతర పంజాబ్ నేతలు ఉన్నారు. సిక్కు మత వ్యవస్థాపకుడు డేరా బాబా గురు నానక్ దేవ్. ఈయన1469 నవంబర్ 29న పంజాబ్‌లో జన్మించారు. 1539 సెప్టెంబర్ 22న ఆయన మరణించారు. అయితే ఆయన పుట్టిన, మరణించిన స్థలాలు రెండు ఇప్పుడు పాకిస్థాన్‌లోనే ఉన్నాయి. ఆయన జన్మస్థలం లాహోర్‌కు దగ్గర్లోని నాన్ కనా సాహిబ్‌లో ఉంది. అక్కడ ఉన్న గురుద్వారాను గురుద్వారా జనమ్ ఆస్థాన్ అని పిలుస్తారు. గురునానక్ దేవ్ చివరి రోజులను కర్తార్ పూర్‌లోని రావి నది ఒడ్డున గడిపారు. దాదాపు 18 ఏళ్ల పాటు అక్కడే ఉండి పరమపదించారు. దీంతో దాన్ని పవిత్ర స్థలంగా సిక్కులు భావిస్తారు.

Related posts