telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“బిగ్ బాస్-4” కంటెస్టెంట్స్ లిస్ట్

Bigg-Boss-4

బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కావడానికి దాదాపు ముహూర్తం ఖాయం అయినట్టే. ఇప్పటికే సీజన్ 4లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ కాగా… 106 రోజుల పాటు బిగ్ బాస్ షో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక హోస్ట్ విషయానికి వస్తే.. మూడో సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన కింగ్ నాగార్జునే నాలుగో సీజన్‌కి హోస్టింగ్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 4 సందడి మొదలయినట్టే. ఇప్పటికే నాగార్జున ప్రోమోతో ఆదరగొట్టేశారు. నాగార్జున ఇటీవల మూడు పాత్రల్లో కనిపించిన బిగ్ బాస్ 4 ప్రోమో తరువాత కచ్చితంగా షో మొదలవుతున్న సంకేతాలు స్పష్టంగా వచ్చాయి. అంతే కాదు ఈ నెలాఖరులో (అందుతున్న సమాచారం ప్రకారం..ఈ నెల 29, 30 తేదీల్లో) బిగ్ బాస్ 4 మొదలయ్యే అవకాశం ఉంది. ఈసారి బిగ్ బాస్ లో 16 మంది ఉండబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలో ఉంది. ఈ పదహారు మంది ఎవరనే విషయంలో భిన్న ప్రచారాలు కూడా ఉన్నాయి. దాదాపుగా 30 పేర్లకు పైగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, వీరిలో బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళబోయేది పదహారు మంది లిస్టు ప్రస్తుత సీజన్ లో సందడి చేయబోతున్నారు. దాదాపుగా వీళ్ళే బిగ్ బాస్ 4 హౌస్ లో నూరు రోజుల పాటు అభిమానులను అలరించబోయేది. అయితే, ఈసారి కరోనా ఉపద్రవ నేపధ్యంలో హౌస్ లో ఉండబోయే వారందరినీ 14 రోజుల ముందుగానే క్వారంటైన్ చేస్తున్నారు. వీరిలో ఎవరికైనా ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తితే వారికి ప్రత్యామ్నాయంగా మరో నలుగురిని కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

1. డాన్స్ మాస్టర్ రఘు – గాయని ప్రణవి.
2. జాహ్నవి అలియాస్ మహాతల్లి… ఆమె భర్త సుశాంత్
3. డాన్సర్ మెహబూబ్ దిల్‌సే
4. గోదావరిఖని కుర్రోడు సొహైల్ రియాన్
5. హెచ్‌ఎంటీవీలో జోర్దార్ వార్తలు చదివే సుజాత (అసలు పేరు ప్రతికాంతం శ్రుతి)
6. యాంకర్ అరియానా గ్లోరీ
7. కరాటే కల్యాణి
8. ఫేమస్ యాంకర్ లాస్య
9. యాక్టర్ నందు
10. యాక్టర్ నోయల్
11. జెమిని యాంకర్ ప్రశాంతి
12. జబర్దస్త్ యాంకర్ రాం ప్రసాద్, అవినాష్ వీల్లిద్దరులో ఒకరు కచ్చితంగా షోలో ఉంటారు.

Related posts