telugu navyamedia
తెలంగాణ వార్తలు

పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే కేసీఆర్‌ ఏం చేస్తారని ప్రశ్నించారు…

నల్గొండ జిల్లా ఆర్జాలబావి ఐకేపీ కేంద్రంలో ధాన్యం కొనుగోళ్లు పరిశీలన కోసం వెళ్లిన బండి సంజ‌య్ పర్యటన ఉద్రిక్త‌త చోటుచేసుంది. తెరాస కార్యకర్తలు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ తెరాస శ్రేణులు పెద్దఎత్తున ఆందోళన‌లు చేశారు. తెరాస, భాజపా శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశారు.. దీంతో ఉద్రిక్తతల మధ్యే ఐకేపీ కేంద్రంలోని ధాన్యం రాశులను బండి సంజయ్ ప‌రిశీలించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెరాస కార్యకర్తలు రైతుల్లాగా వచ్చి గొడవ చేస్తున్నారని ఆయన మండి పడ్డారు. రైతులపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తారా? అని నిలదీశారు. శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కోసం రాళ్ల దాడికి సిద్ధమేనని స్పష్టం చేశారు. పండిన ప్రతి గింజా కొంటానని సీఎం కేసీఆర్ గతంలో చెప్పారని… సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

వానాకాలంలో పంట మొత్తం కొనాల్సిందేనని డిమాండ్ చేశారు. పంటలన్నీ కేంద్రం కొనుగోలు చేస్తే సీఎం ఏం చేస్తారని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు పడుతున్నారని… ధాన్యం మొలకలు వస్తోందని అన్నారు.  60లక్షల టన్నులు కొనాలని ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకొని… 7 లక్షల టన్నులే కొన్నట్టు రాష్ట్ర ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. మిగతా పంట ఎప్పుడు కొంటారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు

Related posts