telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

గుర్రం చెరువు కట్ట తెగిపోవడంతో ఇళ్లల్లో 10 అడుగుల మేర నీరు…

ఇప్పటికే భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఇక, హైదరాబాద్‌లో పరిస్థితి దారుణంగా ఉంది… ఎగువ నుంచి భారీ ఎత్తున వరద రావడంతో.. హిమాయత్‌ సాగర్‌, హుస్సేన్‌ సాగర్‌ అలుగులు పోస్తున్నాయి. మూసీ ఉగ్రరూపం దాల్చింది. వీధుల్లో వరద నీరు కంటపడ్డ వస్తువులను తనలో కలిపేసుకుని బీభత్సం సృష్టించింది. ఈక్రమంలోనే చాంద్రాయణగుట్టలోని బాబానగర్‌లో శనివారం రాత్రి వెలుగుచూసిన దృశ్యాలు హార్రర్‌ సినిమాను తలపిస్తున్నాయి. ఒకవైపు కుండపోత వర్షం, మరోవైపు కరెంటు లేకపోవడంతో బాబానగర్‌ వాసులు బిక్కుబిక్కుమంటూ.. ఎప్పుడు తెల్లారుతుందా అని చూస్తున్న సమయంలో.. తెల్లవారుజాము మూడు గంటలకు ఒక్కసారిగా ఆ ప్రాంతంలోకి వరద చొచ్చుకువచ్చింది. గుర్రం చెరువు కట్ట తెగిపోవడంతో బాబానగర్‌లోని చాలా ఇళ్లల్లో చూస్తుండగానే 10 అడుగుల మేర నీరు చేరింది.

Related posts