telugu navyamedia
రాజకీయ

ఢిల్లీ కాలుష్యం పై కేంద్ర, ఢిల్లీ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం..

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సోమవారం కేంద్ర, రాష్ట్రాలకు తీవ్రస్థాయిలో మండిపడింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ఆపి కాలుష్యాన్ని నియంత్రించే పనులు చేయాలని ఆదేశించింది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఆదేశించాలని కేంద్ర, రాష్ట్రాలకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. 

ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న తమ ఉద్యోగుల కోసం కేంద్రం, రాష్ట్రాలు కాలుష్యాన్ని తగ్గించడానికి వ్యవసాయ వ్య‌ర్ధాల‌ను కాల్చకుండా రైతులను ఒప్పించాలని, రాజధాని యొక్క గాలి నాణ్యత పెంచాల‌ని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది.

దేశ రాజధాని నగరంలోని వాయు కాలుష్యంపై ఢిల్లీ సర్కారు కుంటిసాకులు చెపుతుందని, రాష్ట్రప్రభుత్వం వసూలు చేస్తున్న ఆదాయాలపై ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు సూచించింది.

దేశ రాజధానిలో కాలుష్యం తగ్గించేందుకు వాహన రాకపోకలను నియంత్రించాలని, పార్కింగ్ ధరలు పెంచడం వంటి చర్యలు చేపట్టాలని ఢిల్లీ ప్రభుత్వానికి సోలిసిటర్ జనరల్ సూచించారు. డీజిల్ జనరేటర్ల నిషేధం, బస్, మెట్రో సర్వీసులను పెంచి, సొంత వాహనాల్లో తిరగడం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తెలిపారు.

విషపూరిత పొగను తగ్గించేందుకు తక్షణ చర్యలు తీసుకోవడానికి మంగళవారం రాష్ట్రాలు మరియు అధికారుల అత్యవసర సమావేశాన్ని రావాల‌ని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. అంతేకాకుండా మరుసటి రోజు ఈ విషయాన్ని మళ్లీ వింటామని కోర్టువాయిదా వేసింది.

విచార‌ణ‌కుముందు ఢిల్లీ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వాయు కాలుష్యంపై పోరాడటానికి పూర్తి లాక్‌డౌన్ వంటి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అయితే, పొరుగు రాష్ట్రాల్లోనూ లాక్‌డౌన్‌ విధిస్తేనే..ఫలితం ఉంటుందని కోర్టుకు తెలిపింది.

పంట వ్యర్థాల దహనం ఢిల్లీ కాలుష్యానికి కారణం కాదని.. పలు నివేదికల ఆధారంగా ఈ విషయం తెలిసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. మొత్తం కాలుష్యంలో 10% మాత్రమే పంట వ్యర్థాల దహనం కారణమని సోలిసిటర్ జనరల్ వివరణ ఇచ్చారు.

 

Related posts