telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఇవాళ్టి నుంచే శబరిమల అయ్యప్ప దర్శనం.. మార్గదర్శకాలు ఇవే

శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని రెండు నెలల మండల పూజలో భాగంగా ఆదివారం సాయంత్రం తెరిచారు. ఇక ఇవాళ్టి నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు (టీడీబీ) వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. ఈ మేరకు ఆలయ బోర్డు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది ట్రావెన్‌కోర్‌ ఆలయ బోర్డు. 

  • శబరిమల అయ్యప్ప కొత్త మార్గదర్శకాలు ఇవే…
    వర్చువల్‌ క్యూలో రిజిస్టర్‌ చేసుకోని భక్తులను ఆలయంలోకి అనుమతించరు.
    సోమవారం నుంచి శుక్రవారం వరకు 1000 మంది భక్తులను మాత్రమే అనుమతిస్తారు.
    శని, ఆది వారాల్లో మాత్రం 2000 మందిని అనుమతిస్తారు.
    భక్తులకు కోవిడ్‌-19 నెగిటివ్‌ సర్టిఫికెట్ తప్పనిసరి.
    10 ఏళ్లలోపు, 60 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారిని దర్శనానికి అనుమతించరు.
    పంబా నదిలో దిగి స్నానాలు చేయడానికి భక్తులకు అనుమతి లేదు.
    రెండు నెలల పాటు జరిగే పుజా కార్యక్రమాల్లో మొత్తం 85, 000 మంది దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు.

Related posts