telugu navyamedia
సినిమా వార్తలు

యూట్యూబ్ లో “అవెంజర్స్ ఎండ్ గేమ్”

Avengers

“అవెంజర్స్ ఎండ్ గేమ్” పాత రికార్డులన్నిటిని బద్దలు కొట్టేస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అతి తక్కువ కాలంలో ఎక్కువ కలెక్షన్స్ అందుకుని, హాలీవుడ్ బాక్సాఫీస్ కలెక్షన్ల రికార్డులను తిరగరాసింది. 2 బిలియన్ డాలర్స్ ను అతి వేగంగా అందుకొని 21 ఏళ్ల తరువాత సరికొత్త వరల్డ్ రికార్డ్ ను నెలకొల్పింది. అవతార్, ఇన్ఫినిటీ వార్ సినిమాల కలెక్షన్స్ ని సైతం “ఎండ్ గేమ్” దాటేసింది. ఈ క్రమంలోనే తాజాగా పలు డిలీటెడ్ సీన్స్‌ను కలిపి మూవీని చిత్ర యూనిట్ మళ్లీ విడుదల చేసింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీని ప్రస్తుతం ప్రేక్షకులు గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ ఐట్యూన్స్, యూట్యూబ్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ మూవీ ఎస్‌డీ, హెచ్‌డీ ఫార్మాట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇంగ్లిష్ వెర్షన్ మాత్రమే లభిస్తున్నది. ఐట్యూన్స్‌లో ఎస్‌డీ ఫార్మాట్ అయితే రూ.120, హెచ్‌డీ అయితే రూ.150 చెల్లించి మూవీని నిర్దిష్ట కాలం పాటు అద్దెకు తీసుకోవచ్చు. అదే కొనుగోలు చేయాలనుకుంటే రూ.490 (ఎస్‌డీ) లేదా రూ.690 (హెచ్‌డీ) చెల్లించాల్సి ఉంటుంది. ఇక గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్‌లలో రూ.100 (ఎస్‌డీ) లేదా రూ.150 (హెచ్‌డీ) చెల్లించి ఈ మూవీని రెంట్‌కు తీసుకోవచ్చు. లేదా రూ.690 (ఎస్‌డీ), రూ.850 (హెచ్‌డీ) చెల్లించి మూవీని కొనుగోలు చేయవచ్చు. త్వరలోనే బ్లూ రే ఫార్మాట్‌లో, హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ మూవీ డిస్క్‌లను విక్రయించనున్నారని తెలుస్తోంది.

Related posts