telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌ : … జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా … అతుల్‌ కార్వల్‌ …

atul karwal as director to police acadamy

జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా అతుల్‌ కార్వల్‌ నియమితులయ్యారు. ఈ మేరకు హోంశాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆమోదం తెలిపింది. గుజరాత్‌ క్యాడర్‌కు చెందిన 1988 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన అతుల్‌ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ అదనపు డైరెక్టర్‌ జనరల్‌గా ఉన్నారు.

ఇంతవరకు పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న అభయ్‌ ఒడిశా డీజీపీగా వెళ్లడంతో ఆయన స్థానంలో అతుల్‌ నియమితులయ్యారు. 2021 డిసెంబరు 5 లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. వాస్తవంగా పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా డీజీ హోదా అధికారిని నియమిస్తారు. ఈ పోస్టును అదనపు డీజీ స్థాయికి తగ్గించి అతుల్‌ను నియమించారు.

Related posts