డ్రగ్స్ కేసులో బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై విచారణను బాంబే హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మరో లాయర్ సతీశ్‌మనేషిండే బాంబే హైకోర్టులో వాదనలు వినిపించారు. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు ముకుల్ రోహత్గీ. అరెస్టు వేళ ఆర్యన్‌పై కుట్ర అభియోగాలు లేవని చెప్పారు.
ఆర్యన్ ఖాన్‌బెయిల్ పిటిషన్‌పై తరుఫు న్యాయవాదులు వాదించిన తర్వాత ఎన్సీబీ తరపున లాయర్ వాదనలు వినిపించాల్సి ఉంది… అయితే వారి వాదనను రేపు వింటామని స్పష్టం చేసిన న్యాయమూర్తి విచారణను గురువారానికి వాయిదా వేశారు. దీంతో ఆర్యన్ ఈరోజు రాత్రి కూడా జైలులోనే ఉండనున్నారు. అక్టోబర్ 3న అరెస్టయిన ఆర్యన్ ఖాన్.. దాదాపు రెండు వారాల నుంచి జైలులోనే ఉంటున్నాడు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగుతుంది.
కాగా.. ఈ నెల 3న ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) దాడి చేసి ఆర్యన్‌ఖాన్‌తోపాటు పలువురిని పట్టుకున్న విషయం తెలిసిందే.