ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ప్రకారం ఇంటర్ పరీక్షలు ఉంటాయని స్పష్టం చేసి.. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతుండగా.. ఇప్పుడు ఎస్ఎస్సీ పరీక్షల నిర్వహణపై కూడా ఫోకస్ పెట్టింది విద్యాశాఖ.. మే నెల మొత్తం సెలవులు ప్రకటించినా.. పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్జేడీలకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఏపీ పది, ఇంటర్ పరీక్షలపై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారని, ఇది లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిన అంశామని హై కోర్టు పేర్కొంది. కరోనా నేపథ్యంలో ఏపీ సర్కార్ పునరాలోచించాలని తెలిపింది. పక్క రాష్ట్రాలలో పరీక్షలు వాయిదా వేస్తే.. మీరు ఎలా నిర్వహిస్తారని హై కోర్టు ప్రశ్నించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ సర్కార్ ను హై కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను మే 3 కు హై కోర్టు వాయిదా వేసింది.