సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య బాలీవుడ్ లో పెను దుమారమే రేపింది. అందులో భాగంగానే నెపోటిజంపై తీవ్ర చర్చ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ హీరోయిన్ లు, దర్శక నిర్మాతలపాటు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై కూడా కామెంట్స్ చేసింది. ఓ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ అనురాగ్ కశ్యప్ ను ‘మినీ మహేశ్ భట్’ అన్న విషయం తెలిసిందే. దాంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై అనురాగ్ కశ్యప్ స్పందించారు. తాను ఒక స్నేహితుడిగానే ఆమె సమస్యలను పరిష్కరించాలనుకున్నానని, ఈ విషయమై తనను బాధపెట్టి ఉంటే క్షమాపణలు చెప్పేందుకు రెడీ గా ఉన్నానని తెలిపారు. ఒకప్పుడు కంగనా తనకు మంచి స్నేహితురాలని, అంతే కాకుండా ఆమెకు సినిమాల్లో అవకాశాలు కూడా ఇప్పించానని చెప్ప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయిందని అభిప్రాయపడ్డారు. తనకు తాప్సి, కంగనా ఇద్దరు మంచి స్నేహితులని వారి గొడవలను సర్ది చెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదన్నారు. ఈ విషయం పై కంగనాకు చేసిన మెసేజ్ లను ఆమె సోషల్ మీడియాలో పెట్టి రచ్చ చేసిందన్నారు.
previous post