ఏపీ సీఎం జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అనిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంకన్నపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే సీఎం ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించాలని అన్నారు. 1860 నుంచి డిక్లరేషన్ ఇచ్చే నిబంధన టీటీడీలో ఉందని చెప్పారు. బ్రిటీష్ పాలకులు సైతం ఈ నిబంధనను అనుసరించారని తెలిపారు.
హిందువులైన మంత్రులు సైతం సీఎం మన్ననలు పొందేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల వేంకటేశ్వరస్వామి జోలికి వెళ్లవద్దని హితవు పలికారు. హిందూ ధర్మాలపై నమ్మకం లేని మంత్రి కొడాలి నాని తన పేరును మార్చుకోవాలని సూచించారు.