రాష్ట్రంలోని వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. బదిలీలకు సంబంధించి వెసులుబాటు కల్పించే నిర్ణయం తీసుకుంది.
బదిలీలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న నిబంధనలను సడలిస్తూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై తమ సొంత మండలానికి బదిలీపై వెళ్లవచ్చు. ఇదివరకున్న నిబంధన ప్రకారం సొంత మండలానికి బదిలీపై వెళ్ళే అవకాశం లేదు.
దీంతోపాటు, ప్రస్తుతం పనిచేస్తున్న పట్టణంలోని ఇతర వార్డులకు లేదా ఉమ్మడి జిల్లా పరిధిలోని ఇతర మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు బదిలీ అయ్యేందుకు కూడా అవకాశం కల్పించింది.
ఈ మార్పు వల్ల చాలా మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు.


ప్రాజెక్టుల్లో జరుగుతున్న అవినీతిని బయటపెడుతాం: డీకే అరుణ