ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా సంస్కరణలు, రాజధాని అమరావతి విస్తృత అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు.
ప్రధానంగా, ఈ సమావేశంలో పరిపాలనను మరింత వికేంద్రీకరించి ప్రజలకు సేవలు వేగంగా అందించాలన్న లక్ష్యంతో మూడు కొత్త జిల్లాలు, పలు రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముంది.
అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ఎల్పీఎస్ జోన్ – 8 పరిధిలో లే అవుట్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం రూ.1,358 కోట్ల నిధుల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
ఇవేకాకుండా పలు సంస్థలకు భూముల కేటాయింపులు, రుషికొండ భవనాల అంశంపై చర్చ, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.
కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులతో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉందని సమాచారం.


చంద్రబాబు ఉండవల్లి నివాసాన్ని ఖాళీ చేయాలి: ఎమ్మెల్యే ఆర్కే డిమాండ్