జబర్దస్త్ కమెడియన్స్‌లలో తనదైన పంచ్ డైలాగులతో పొట్టచెక్కలయ్యే కామెడీ చేసే హైపర్ ఆది.. ఇప్పుడు సినీ నటుడిగా, యాంకర్‌గా కూడా సక్సెస్‌ఫుల్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో తనతో పాటు చేస్తున్న ఓ లేడీ యాంకర్ ఆయనకు హ్యాండిచ్చిందనే వార్తలు తెరపైకి వచ్చాయి. ‘ఢీ’ ప్రోగ్రాంలో యంగ్ యాంకర్ వర్షిణితో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నాడు హైపర్ ఆది. ఆమెతో కలిసి మనోడు చేస్తున్న రొమాంటిక్ డ్యూయెట్స్ అబ్బో! అనిపిస్తున్నాయి. స్టార్ హీరోహీరోయిన్లకు ధీటుగా కెమిస్ట్రీ పండిస్తూ బుల్లితెర ఆడియన్స్‌కి సరికొత్త టేస్ట్ చూపించారు ఈ ఇద్దరూ. దీంతో ఇప్పటికే ఉన్న హైపర్ ఆది క్రేజ్ రెట్టింపయింది. ఢీ ఛాంపియన్స్‌లో సుధీర్, రష్మి జోడీని మరిపించే విధంగా ఈ ఇద్దరూ మాయ చేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో హైపర్ ఆదికి యాంకర్ వర్షిణి హాండిచ్చిందని తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ‘ఢీ’ ఎపిసోడ్స్ షూటింగ్స్ ఆగిపోయాయి. వర్షిణికి కొత్త వెబ్ సిరీస్‌లలో అవకాశాలు వస్తుండటంతో బిజీ అవుతోంది. ఈ క్రమంలోనే హైపర్ ఆదితో మరోసారి జోడీ కట్టేందుకు వర్షిణి కాస్త ఆలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది.
previous post
next post

