telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

క్యాస్టింగ్ కౌచ్ పై అనసూయ కామెంట్స్

Anasuya

యాంకర్ అనసూయ భరద్వాజ్ మళ్లీ వరుస షోలతో బిజీ అయిపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్‌తో మూడు నెలలపాటు ఖాళీగా ఇంట్లోనే ఉన్న అనసూయ.. మళ్లీ ఇప్పుడు ‘జబర్దస్త్’, ‘ప్రతిరోజూ పండగే’ షోలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఆసక్తికరమైన విషయాలను వెల్లడిచింది. అందులో భాగంగానే క్యాస్టింగ్ కౌచ్ పైన స్పందించింది. తాను అవకాశలకోసం ఎప్పుడూ వెళ్లలేదని కేవలం వచ్చిన అవకాశాలను మాత్రమే ఉపయోగించుకున్నానని స్పష్టం చేసింది.. అదృష్టవశాత్తు నాకు అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది. అవకాశాల కోసం తప్పు చేయకుండా ఎదురు చూడాలని, అది మనం స్పందించే దానిపైన ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ఇక ఫేవరెట్ ఇజం వల్ల తానూ అవకాశాలని మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది అనసూయ.

Related posts