telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

లాక్‌డౌన్ ను ఉల్లంఘించిన ప్రముఖ యాంకర్ పై కేసు నమోదు

akul-balaji

లాక్‌డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఎన్నో పెళ్లిళ్లు వాయిదా ప‌డ్డాయి. మ‌రీ అంత‌గా అవసరమైతే 20 మందికి మించ‌కుండా పెళ్లి తతంగం పూర్తి చేయాల‌ని ష‌ర‌తులు విధించాయి ప్రభుత్వాలు. తాజాగా లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్న ఓ ప్రముఖ యాంకర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగళూరులోని తన గెస్ట్‌ హౌస్‌లో పెళ్లి చేసేందుకు అతడు భారీ ఏర్పాట్లు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కన్నడలో రియాలిటీ షోలతో పాటు కొన్ని సీరియల్స్ కూడా చేసి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అకుల్ బాలాజీ. కన్నడలో ఈయనకు మంచి పాపులారిటీ ఉంది. మానే ముండే మహాలక్ష్మి, ప్యాతే హుద్గిర్ హల్లీ లిఫు సీజన్‌ 1&2, హోసా లవ్‌ స్టోరీ లాంటి రియాలటీ షోలకు ఆయన హోస్ట్‌గా పని చేసాడు అకుల్. తెలుగులోనూ పెళ్లినాటి ప్రమాణాలు అనే సీరియల్‌ తో పాటు శ్రీముఖితో దేశముదుర్లు అనే షో చేసాడు. “312గో” అనే షోలో యాంక‌ర్‌గా క‌నిపించాడు. దాంతో పాటు తెలుగులో మరికొన్ని షోలు కూడా చేసాడు ఈయన. ఇవన్నీ ఇలా ఉంటే అకుల్ మహేష్ బాబుకు దూరపు బంధువు అవుతాడని ప్రచారం జరుగుతుంది.

Related posts