రేపు మెగాస్టార్ చిరంజీవి తన 65 పుట్టిన రోజును జరుపుకోనున్నారు. అయితే గత ఏడాది సెప్టెంబర్ 02 పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వినాయక చవితి రాగా, ఈ ఏడాది ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజున వినాయక చవితి రావడం విశేషం. ఇది యాదృచ్చికమే అయిన ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇక ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. రేపు చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆచార్య సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రేపు సాయింత్రం నాలుగు గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతల్లో ఒకరైనా రామ్ చరణ్ తేజ్ వెల్లడించారు.
previous post
next post

