telugu navyamedia
సినిమా వార్తలు

69 సంవత్సరాల “నట్టియతార”(తమిళ్)

నందమూరి తారకరామారావు గారు నటించిన తమిళ చిత్రం. “నట్టియతార”(తమిళ్) 25-05-1955 విడుదలయ్యింది.

నిర్మాత ఘంటసాల కృష్ణమూర్తి గారు ప్రతిభా ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ దర్శకులు పి.పుల్లయ్య గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.

నిర్మాతలు ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషలలో సమాంతరంగా నిర్మించారు. తెలుగు చిత్రం  “రేచుక్క” 25-03-1955 న విడుదల కాగా తమిళ చిత్రం “నట్టియతార” 25-05-1955 న విడుదలైనది.

తెలుగు, తమిళ చిత్రాలు రెండిటిలోను ఎన్టీఆర్ గారు అంజలిదేవి హీరో, హీరోయిన్లు గా నటించారు.
ఈ చిత్రానికి సంగీతం: జి.రామనాధన్ – అశ్వథామ, ఫోటోగ్రఫీ: పి.ఎల్.రాయ్ అందించారు.

సంగీత దర్శకులు జి.రామనాధన్ – అశ్వథామ ల సంగీత సారధ్యంలో పాటలు శ్రోతలను అలరించాయి.
దర్శకుడు పి.పుల్లయ్య గారి దర్శక ప్రతిభ తో గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధం వంటి సన్నివేశాలలో మాస్ ప్రేక్షకులకు కనువిందు చేయటంతో

ఈ చిత్రం తెలుగు లో ఘన విజయం సాధించి శత దినోత్సవం జరుపుకున్నది.
అలాగే తమిళం లో మంచి విజయాన్ని అందుకున్నది..

Related posts