ఎన్నార్సీ పై ఇంత వరకు చర్చ జరగలేదని ప్రధాని మోదీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. మోదీ చెప్పింది నిజమేనని అన్నారు. దీనిపై ఇంత వరకు కేబినెట్లో కానీ, పార్లమెంటులో కానీ చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
ఎన్నార్సీపై ఇంత వరకు ఎలాంటి చర్చ జరగని నేపథ్యంలో డిబేట్ అనవసరమని ఆయన అన్నారు. ఇటీవల అసోంలో నిర్వహించిన పౌర జాబితా నేపథ్యంలో, కొత్త జాబితా నుంచి ఏకంగా 19 లక్షల మంది తొలగింపబడ్డారు. వీరిలో చాలా మంది ప్రస్తుతం నిర్బంధ కేంద్రాల్లో ఉన్నారు. ఈ చట్టం ముస్లింలను టార్గెట్ చేసేలా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.