telugu navyamedia
సినిమా వార్తలు

చరణ్‌ను చూసి గర్వపడుతున్నా.. మా బావ ఎన్టీఆర్ పవర్ హౌస్

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్- రామ్‌చరణ్ నటించిన ‘‘ఆర్ఆర్ఆర్’’ రిలీజై అన్ని చోట్ల హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది.సామాన్య ప్రేక్షకుల నుంచి మొదలు సెలబ్రిటీల వరకు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ఆర్ ఆర్ ఆర్‌’ సినిమాపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, భార్య అల్లు స్నేహారెడ్డి, పిల్లలతో కలిసి ఏఎంబీ మాల్ లో ట్రిపులార్‌ సినిమాను వీక్షించారు..

ఈ సందర్భంగా బన్నీ ట్వీట్‌ చేస్తూ.. ‘”ఆర్ఆర్ఆర్’ చిత్ర బృందం అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. సినిమా అద్భుతంగా ఉంది. వెండితెరపై ఇటువంటి అద్భుతాన్ని ఆవిష్కరించిన, ఊహించిన రాజమౌళి గారు అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన మన అందరికీ గర్వకారణం.
నా బ్రదర్ రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. చరణ్‌ను చూసి ఎంతో  గర్వపడుతున్నట్లు తెలిపారు అల్లు అర్జున్. 

మరోవైపు ..మా బావ తారక్ (ఎన్టీఆర్) అద్భుతంగా నటించాడు. ఎన్టీఆర్ ఒక పవర్ హౌస్” అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

అంతేకాకుండా బాలీవుడ్‌ స్టార్‌ హీరో అజయ్‌ దేవగన్‌, అలియా భట్‌పై ప్రశసంలు వర్షం కురిపించారు. ఇండియన్‌ సినిమా ఖ్యాతిని పెంచిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు బన్నీ.

Related posts