telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘కరోనా’ లేదు.. ఆందోళన వద్దు: ఆళ్ల నాని

Alla-Nani minister

రాష్ట్రంలో కరోనా వైరస్‌ లేదని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ఏలూరులో బుధవారం జరిగిన పశ్చిమగోదావరి జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్‌పై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుందని చెప్పారు. దీనికి సంబంధించి ఇప్పటికే నోడల్‌ అధికారులను నియమించామని, ప్రతి జిల్లా వైద్య కేంద్రంలో ప్రత్యేకంగా ఐదు పడకలతో వార్డులు ఏర్పాటు చేసి వెంటిలేటర్ల సదుపాయాన్ని కల్పించినట్లు వివరించారు.

Related posts