telugu navyamedia
సినిమా వార్తలు

పాకిస్తాన్ వెళ్తే చాలా ఆనందంగా ఉంటా… : “ఆర్ఆర్ఆర్” హీరోయిన్ తల్లి

Soni Razdan

పాకిస్తాన్ కు వెళ్తే అక్కడ తాను సంతోషంగానే ఉంటానని అలియా భట్ తల్లి, సినీ నటి సోని రజ్దాన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతకొన్ని రోజులుగా ఆమెను పాకిస్తాన్ వెళ్లమంటూ నెటిజెన్లు ట్రోల్స్ చేస్తున్నారు. వారి చెప్పిన ప్రకారమే తాను పాకిస్తాన్ వెళ్తానని, అక్కడ సాంస్కృతిక సమతుల్యత ఉంటుందని సోని సరదాగా చెప్పుకొచ్చారు. సోని రజ్దాన్‌ది జమ్మూ కశ్మీర్.. అయితే ఆమె ఈ మధ్యే ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనపై నెటిజెన్లు చేస్తున్న ట్రోలింగ్ కు సమాధానం ఇచ్చారు.

‘‘నేనేదైనా మాట్లాడానంటే.. వెంటనే కొంత మంది నన్ను దేశద్రోహి అంటున్నారు. అంతటితో ఆగక పాకిస్తాన్ వెళ్లిపో అంటున్నారు. నాకూ అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. నేనూ పాకిస్తాన్‌కు వెళ్లిపోవాలని. పాకిస్తాన్ వెళ్లిపోయాక నేను చాలా ఆనందంగా ఉంటాను. అక్కడ ఆహారం కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ నా గురించి ఆలోచించేవారూ చాలా మందే ఉన్నారు. అందుకే నేను ఇలాంటివి పెద్దగా పట్టించుకోను’’ అని సోనీ రజ్దా చెప్పుకొచ్చారు. అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన “నో ఫాదర్స్ ఇన్ కశ్మీర్” అనే చిత్రంలో, ఇంకా కొన్ని చిత్రాల్లో కీలకమైన పాత్రల్లో సోనీ రజ్దానా నటించారు.

Related posts