మరణం గురించి నాకు బాధ లేదని, మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్ లో బీజేపీ అభ్యర్థి గెలవడం నాకు బాధ కలిగించిందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. కరీంనగర్లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పుడు బీజేపీకి అడ్రస్ కూడా లేదు.. కానీ ఇప్పుడు ఏకంగా ఎంపీ స్థానాన్నే గెలుచుకోవడం ఆవేదనగా ఉందన్నారు.
కరీంనగర్లో తాను చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం తన మాటలను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.ఎవరి మనోభావాలు దెబ్బతినేలా తాను మాట్లాడలేదని అన్నారు. తన ప్రసంగంలో ఎటువంటి అభ్యంతరకరమైన లేదా చట్టవిరుద్ధమైన ప్రకటన ఇవ్వలేదని స్పష్టం చేశారు. మృత్యువు తనను ఏ క్షణమైనా వెంటాడవచ్చని,
ఎక్కువకాలం బతకనని డాక్టర్లు చెప్పారని ఆయన పేర్కొన్నారు.


అందుకే కవిత ఓడిపోయింది: జీవన్‌రెడ్డి