చత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన రాయ్ పూర్ లోని శ్రీ నారాయణ్ ఆసుపత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు. ఈ నెల 9న తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆపై ఆయన పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇష్టమైన పాటలను ఇయర్ ఫోన్స్ ద్వారా వినిపిస్తున్నారు.
అజిత్ జోగి అస్వస్థకు ఓ చింతపిక్క కారణమని వైద్యులు చెబుతున్నారు. చింతపిక్క ఆయన శ్వాసనాళంలో ఇరుక్కుపోవడంతో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారని వివరించారు. అజిత్ జోగి మెదడును క్రియాశీలకంగా మార్చేందుకు ఆడియో థెరపీ ఇస్తున్నామని శ్రీ నారాయణ్ ఆసుపత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఖేమ్కా వెల్లడించారు.