కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్న హెల్త్ వర్కర్లకు వైరస్ సోకకుండా హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రల వల్ల ప్రయోజనం ఉండే అవకాశం ఉన్నట్లు ఐసీఎంఆర్ నిపుణులు పేర్కొన్నారని ఎయిమ్స్ డైరక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో అందరికీ చికిత్స చేయలేమన్నారు. కానీ ఆ డ్రగ్ వాడితే కొన్ని సందర్భాల్లో గుండెపోటు వచ్చ అవకాశాలు ఉన్నట్లు డాక్టర్ రణ్‌దీప్ తెలిపారు. ఇతర డ్రగ్స్ తరహాలో క్లోరోక్విన్‌కు కూడా సైడ్ఎఫెక్ట్స్ ఉన్నాయన్నారు.
సాధారణ ప్రజలకు ఆ మాత్రల వల్ల మంచి కన్నా చెడు ఎక్కవ జరిగే ప్రమాదం ఉందన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పాటు అజిత్రోమైసిన్ కలిపి పేషెంట్లకు ఇస్తే, వారు కోలుకున్నట్లు చైనాతో పాటు ఫ్రాన్స్‌లో జరిగిన కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అయితే స్వల్ప స్థాయిలో వైరస్ ఉన్నవారికి ఈ ట్యాబ్‌లెట్ల కాంబినేషన్ ఫనిచేస్తున్నట్లు ఎయిమ్స్ డైరక్టర్ తెలిపారు. అయినా ఆ డేటా అంత నమ్మశక్యంగా లేదన్నారు.
బీజేపీ నేతలకు పబ్లిసిటీపిచ్చి పట్టుకుంది: తలసాని