telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు

మే రెండో వారంలో పదో తరగతి ఫలితాలు!

Degree exams TDP questiona Anantapur

ఏపీ పదవ తరగతి పరీక్ష ఫలితాలు మే నెల రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని పాఠశాల విద్య రాష్ట్ర కమిషనరు సంధ్యారాణి తెలిపారు. మంగళవారం కడప జిల్లా పర్యటనకు వచ్చిన ఆమె కడప నగరపాలక ప్రధాన ఉన్నత పాఠశాలలో పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకనాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 21వేల మంది ఉపాధ్యాయులు 69 లక్షల పేపర్లను దిద్దుతున్నారని తెలిపారు. అన్ని జిల్లాల్లో 70శాతం మూల్యాంకనం పూర్తయిందని, కడప జిల్లాలో 80% వరకూ పూర్తయిందని చెప్పారు. 27వ తేదీ నాటికి మూల్యాంకనం పూర్తవుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 267 కరవు మండలాల్లో నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం వరకూ మధ్యాహ్న భోజన పథకాన్ని యథావిధిగా కొనసాగాలని సూచించారు.

Related posts