telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వడ్డీ రేట్లను తగ్గించిన హెచ్‌డీఎఫ్‌సీ!

hdfc bank

ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తగ్గించింది. 91 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు వేర్వేరు కాలవ్యవధులపై అన్ని డిపాజిట్ వడ్డీ రేట్లలో కోత విధించింది. మారిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 25 నుంచే అమలులోకి వస్తాయని ప్రకటించింది. అంటే ఆగస్ట్ 24 వరకు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ పొందినవారికి ఆగస్ట్ 25 నుంచి తక్కువ వడ్డీ వస్తుంది.

సాధారణ ప్రజల కంటే వృద్ధులకు 50 బేసిస్ పాయింట్స్ ఎక్కువ వడ్డీ లభిస్తుంది. అంటే వారికి 3% నుంచి 6.25% వరకు వడ్డీ లభిస్తుంది. ఇక ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గించడంతో పాటు మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్ ఏం ఎల్ ఆర్ 10 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్ ఉంటే ఓసారి తాజా వడ్డీ రేట్లు చెక్ చేసుకోండి. ఇతర బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ ఇస్తున్నా, మీ ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్‌పై ఖాతాదారులు నిర్ణయం తీసుకోవచ్చు.

Related posts