telugu navyamedia
CBN TDP Mahandu ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగుజాతిని ఉద్దేశిస్తూ, ఆశీర్వదిస్తూ మాట్లాడిన AI ఎన్టీఆర్ ప్రసంగం మహానాడులో విశేషంగా ఆకట్టుకుంది

తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకుని, మహానాడు వేదికగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు.

ఎన్టీఆర్ జన్మదినం తెలుగు ప్రజలకు పండుగ రోజు అన్నారు. ఇక తెలుగుజాతిని ఉద్దేశిస్తూ, ఆశీర్వదిస్తూ మాట్లాడిన AI ఎన్టీఆర్ ప్రసంగం మహానాడులో విశేషంగా ఆకట్టుకుంది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు ఆంధ్రప్రదేశ్లో అమలు చేసిన పథకాలు, సాధించిన అభివృద్ధి గురించి ఏఐ ఎన్టీఆర్ ప్రస్తావించారు.

తాను ప్రారంభించిన పథకాలను గుర్తుచేస్తూ, చంద్రబాబు నాయకత్వంలో రూపుదిద్దుకున్న ప్రస్తుత సంక్షేమ పథకాలపై ప్రశంసలు కురిపించారు.

ఈ ఏఐ ప్రసంగం మహానాడుకు హాజరైన ప్రతినిధులు, కార్యకర్తలను ఎంతగానో ఉత్తేజపరిచింది

Related posts